ప్రభుత్వ పాలసీలే అమలు చేస్తారా.. కోర్టు ఆదేశాలు అమలు చేయరా?

హైదరాబాద్ : తెలంగాణలో 3 నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియపై అసహనం వ్యక్తం చేసింది. విద్యాసంస్థల్లో సిబ్బందికి 2 నెలల్లో టీకాలు పూర్తి చేయాలి హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలన్న హైకోర్టు.. మొత్తం పరీక్షల్లో 10శాతమే ఆర్టీపీసీఆర్ జరుగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాలసీలే అమలు చేస్తారా.. కోర్టు ఆదేశాలు అమలు చేయరా? అని ప్రశ్నిచింది.

కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే పరిణామాలు ఉంటాయి హైకోర్టు హెచ్చరించింది. ఈనెల 30లోగా సీసీజీఆర్ఏ రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. కరోనా మందులను అత్యవసర జాబితాలో చేర్చకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఎంతమంది మరణించాక చేరుస్తారని కేంద్రంపై హైకోర్టు మండిపడింది. అక్టోబరు 31లోగా అత్యవసర జాబితాలో చేర్చాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబరు 4కి వాయిదా వేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/