సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

కూల్చివేతపై దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ.. హైకోర్టు తుది తీర్పు

telangana-high-court
telangana-high-court

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. ఈ కూల్చివేత నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు నేడు కొట్టివేస్తూ ..తుది తీర్పు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన సచివాలయాన్ని కూల్చి వేసి… కొత్త సెక్రటేరియట్ కట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, ప్రొఫెసర విశ్వేశ్వర రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. చివరకు మార్చి 10న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై హైకోర్టు ఇవాళ తుది తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాత సచివాలయాన్ని కూల్చి.. కొత్త సెకట్రేరియట్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/