కరీంనగర్‌లో ఎన్నికలు జరుపుకోవచ్చు
సింగిల్ జడ్జి తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

హైదరాబాద్: కరీంనగర్‌లో కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు ఆమోదం తెలిపింది. కరీంనగర్‌లోని మూడు డివిజన్ల రిజర్వేషన్లపై గతంలో సింగిల్ జడ్జి అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. కాగా దానిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలును స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది. తాజాగా సింగిల్ జడ్జి తీర్పును నిలివేస్తున్నట్లు పేర్కొంది. మున్సిపల్ ఎన్నికలను జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిచ్చింది. దీంతో కరీంనగర్‌లోని మూడు డివిజన్ల ఎన్నికలకు మార్గం సగమమైంది. షెడ్యూల్ ప్రకారమే కరీంనగర్ కార్పొరేషన్‌లోనూ ఎన్నికలు జరగనున్నాయి.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/