దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ విచారణ వాయిదా

High Court of Telangana
High Court of Telangana

హైదరాబాద్‌: దిశ నిందితుల ఎన్‌ కౌంటర్‌ కేసుపై పిటిషన్‌ దాఖలు అయిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం నలుగురు నిందితుల మృతదేహాలు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నాయి, అయితే నిందితుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించాలని ధర్మాసనం ఆదేశించింది. సీనియర్‌ లాయర్‌ ప్రకాశ్‌ రెడ్డిని మధ్య వర్తిత్వంగా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ పై విచారణ ఉన్న నేపథ్యంలో కేసును వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. కాగా శుక్రవారం వరకు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం తరపున జనరల్‌ అడ్వకేట్‌ ప్రసాద్‌ వాదనలను వినిపించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: