కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

సుదీర్ఘంగా సాగనున్న కౌంటింగ్ ప్రక్రియ

హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది. నగరంలోని సరూర్‌నగర్‌లో ఉన్న ఇండోర్‌ స్టేడియంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం హాళ్లలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల స్థానాల ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ రెండు స్థానాలకు గత ఆదివారం పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ‘హైదరాబాద్‌’ స్థానంలో 3,57,354 ఓట్లు పోలవగా, ‘నల్లగొండ’ స్థానంలో 3,86,320 ఓట్లు పోలయ్యాయి. ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి. జంబో బ్యాలెట్‌ పత్రాల దృష్ట్యా ఫలితం తేలేందుకు చాలా సమయం పట్టనుంది. రాత్రి 8 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రాత్రి 9.30 గంటల తర్వాతే తొలి రౌండ్‌ పూర్తయ్యే అవకాశం ఉన్నది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు తేలకుంటే ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపడుతారు.


తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/