వారంలోగా ‘రైతుబంధు’

rythu bandhu
rythu bandhu

హైదరాబాద్‌: తెలంగాణలో రైతు బంధు పథకం కింద తొలి విడుతగా శాసనసభ ఎన్నికలకు ముందే దాదాపు 44 లక్షల మందికి పెట్టుబడి సాయం అందించారు. మరో ఏడులక్షల మందికి పంపిణీ చేయాల్సి ఉండగా, వివిధ కారణాలతో నిలిచిపోయింది. అయితే యాసంగి పంటలకు రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందని రైతులకు వారంలోగా పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.. ఆ రైతులకు దాదాపు రూ.800 కోట్లను పంపిణీచేసేందుకు కార్యాచరణ సిద్ధంచేస్తున్నట్టు సమాచారం. మార్చి 31తోనే యాసంగి కాలం ముగిసినా సాయం అందనివారిని దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/