పల్లె ప్రగతి కోసం రూ.64 కోట్లు విడుదల

cm kcr
cm kcr

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం రూ.64కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాలకు రూ.2కోట్ల చొప్పున నిధులను విడుదల చేశారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి విడుదలైన నిధులు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగించాలని జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలను జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణరావు ఉత్తర్వులను విడుదల చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/