తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఈ విద్యా సంవత్సరం నుండి జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం.. సిఎం కెసిఆర్‌

cm kcr

హైదరాబాద్‌: తెలంగాణలో ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని సిఎం కెసిఆర్‌ నిర్ణయించారు. జడ్చర్ల డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ రఘురామ్‌ తన సొంత ఖర్చులతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారని సిఎం కెసిఆర్‌ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లెక్చరర్‌ రఘురామ్‌ను సిఎం అభినందించారు. ఈ నేపథ్యంలోనే కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాల్సిన అవసరాన్ని సిఎం గుర్తించారు. రఘురామ్‌ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్‌ కాలేజీకి నూతన భవనాన్ని సిఎం‌ మంజూరు చేశారు. కాగా ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్‌ పెరిగిపోతున్నాయని సిఎం అన్నారు. ఈ పరిస్థితిని నివారించడంతో పాటు విద్యార్థులకు పౌష్ఠికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సిఎం చెప్పారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/