గవర్నర్ పై సుప్రీం కోర్టులో పిటీషన్​ వేసిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt Files Writ in SC Against Governor Tamilisai

హైదరాబాద్‌ః గవర్నర్ తమిళిసై సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించిన 10 బిల్లులను పెండింగ్ లో పెట్టారని.. ఆమోదించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ.. తెలంగాణ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసింది. చీఫ్ సెక్రటరీ ఈ పిటీషన్ ను అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేయటం విశేషం.

గవర్నర్ తమిళిసై వ్యవహార తీరు బాగోలేదని.. ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకపోవటాన్ని తప్పుపడుతుంది ప్రభుత్వం. ఆరు నెలలుగా 10 బిల్లులను ఆమోదించకుండా తొక్కిపెడుతున్నారని వాదిస్తూ.. గవర్నర్ పరిధి ఏంటీ.. ఎందుకు బిల్లులు ఆమోదించటం లేదనే విషయాన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యింది బిఆర్ఎస్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే పిటీషన్ దాఖలు చేస్తూ.. బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది సర్కార్. ఈ పిటీషన్ మార్చి 3వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉంది.