వచ్చే నుండి ఒక్కొక్కరికి 15 కిలోల ఉచిత బియ్యం: తెలంగాణ ప్రభుత్వం

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 5 కిలోల చొప్పున కేంద్రం బియ్యం పంపిణీ

telangana-govt-decided-to-distribute-15-kg-free-rice-ration-card-holders-in-august

హైదరాబాద్ : వచ్చే నెలలో రేషన్‌కార్డు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి. అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పథకం కింద కరోనా సంక్షోభం నుంచి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.

పలుమార్లు ఈ పథకాన్ని పొడిగించిన కేంద్రం ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు కూడా ఈ పథకం కింద ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మే నెలలో ఈ ఉచిత బియ్యం పంపిణీని పూర్తిగా ఎత్తివేయడంపై విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టులో ఒక్కొక్కరికీ 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/