కొత్త వేరియంట్‌పై అప్రమత్తమైన ప్ర‌భుత్వం

హైదరాబాద్: రాష్ట్ర ప్ర‌భుత్వం కొవిడ్ కొత్త వేరియంట్‌పై అప్ర‌మ‌త్తం అయింది. ఈ నేప‌థ్యంలో ఈ నెల 28న(ఆదివారం) వైద్యారోగ్య శాఖ అధికారుల‌తో మంత్రి హ‌రీశ్‌రావు స‌మావేశం కానున్నారు. క‌రోనా కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల విష‌యంలో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించ‌నున్నారు.

కొత్త వేరియంట్ విజృంభించిన దేశాల నుంచి రాక‌పోక‌ల‌పై చ‌ర్చించి కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు. అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌పై ఇప్ప‌టికే రాష్ట్రాల‌ను కేంద్రం అప్ర‌మ‌త్తం చేసిన సంగ‌తి తెలిసిందే. అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల ట్రేసింగ్, టెస్టింగ్‌పై మంత్రి హ‌రీశ్‌రావు వైద్యారోగ్య శాఖ అధికారుల‌తో చ‌ర్చించి, ప‌లు సూచ‌న‌లు చేయ‌నున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/