రాష్ట్రంలో కరోనా కేసులు.. గవర్నర్ ఆందోళన

తెలంగాణలో ఒక్క రోజే 199 కరోనా పాజిటివ్ కేసులు

telangana-governor

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజకు పెరగుతున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలో ఒక్క రోజే 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయమన్నారు. కేసులు ఇలా పెరగడం పై తాను ఆందోళన చెందుతున్నానని ట్విట్టర్‌లో ట్వీట్ పెట్టారు. ఓవైపు ప్రభుత్వం అన్ని రకాలుగా కంట్రోల్ చర్యలు తీసుకుంటున్నా, డాక్టర్లకు, ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్లకు, పోలీసులకు కూడా కరోనా సోకుతుండటం పై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందరం కలసికట్టుగా ఈ కరోనాను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందనీ… మరింత బలంగా పోరాడాలని ఆమె తన ట్వీట్‌లో కోరారు. కాగా కరోనా బారిన పడకుండా ఇప్పటి వరకు పాటించిన జాగ్రత్తలే ఇకముందు కూడా పాటించాలని ఆమె సూచించారు. వైరస్‌ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాని గవర్నర్‌ విజ్ఞప్తి చేశారు.

 రెండు వారాల కిందట తెలంగాణలో కరోనా కంట్రోల్‌లోకి వచ్చినట్లే కనిపించింది. ప్రభుత్వం కూడా... హైదరాబాద్‌లోని అది కూడా నాలుగు చోట్ల మాత్రమే కరోనా ఉందనీ... మిగతా రాష్ట్రమంతా బాగానే ఉందని చెప్పింది. ఆ తర్వాత... యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కరోనా కేసులు వచ్చాయి. కొన్ని రోజులకే... హైదరాబాద్‌లో పరిస్థితి మారింది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా నమోదవుతున్నాయి. తాజాగా ఒక్క రోజులో 199 కేసులు రావడం ఆందోళన కలిగించే విషయమే. ఇలా ఎందుకు జరుగుతుందన్నది ప్రభుత్వ వర్గాలకు కూడా అంతుబట్టట్లేదు. (credit - twitter)


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/