శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌

Tamilisai Soundararajan
Tamilisai Soundararajan

తిరుమల : తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం తెలంగాణ గవర్నర్‌ తమిళిసై దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వచ్చిన తమిళిసైకి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం తమిళిసైకి రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలతో పాటు స్వామివారి చిత్ర పటాన్ని అందించారు. శ్రీవారి దర్శనానంతరం తమిళిసై మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్టు ఆమె తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/