తెలంగాణ మున్సిపాలిటీల్లో 2000 మంది సిబ్బంది నియమకం!

రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలకు 2000 మంది సిబ్బంది నియమించాలని యోచిస్తున్న సర్కార్‌

TS LOGO
TS LOGO

హైదరాబాద్‌: తెలంగాణలో 141 141 మున్సిపాలిటీలకు 2000 మంది సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇంజినీరింగ్‌, టౌన్ ప్లానింగ్, అనేక మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు వంటి విభాగాల్లో సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ విషయమై మంత్రి కెటిఆర్‌ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో సమావేశమై ఖాళీల నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే రెండు, మూడు నెలల్లో ఈ నియామకాలు పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఇంతకుముందు ప్రభుత్వం 70 కొత్త మున్సిపాలిటీలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ప్రతీ మున్సిపాలిటీలో ఒక పర్యావరణ ఇంజినీర్‌ను నియమించాలనే ప్రతిపాదన కూడా ఉంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/