కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం

Etela Rajender
Etela Rajender

హైదరాబాద్‌: కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చాలా బాధ్యతతో పని చేస్తోందని, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా తమ సర్కార్ కు ఉందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఖకరోనాగ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అతిగా స్పందించవద్దని సూచించారు. హైటెక్ సిటీ, మైండ్ స్పేస్ లోని కార్యాలయంలో పని చేసే యువతికి ఖకరోనాగ సోకిందని దుష్ప్రచారం చేశారని, ఆమెకు ఈ వైరస్ సోకలేదని స్పష్టం చేశారు.

ఖకరోనాగ వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందాం కానీ, అతిగా స్పందించే ప్రయత్నం చేయొద్దని, తద్వారా అనేక దుష్పరిణామాలు తలెత్తే ఆస్కారం ఉందని ప్రజలకు సూచించారు. తెలంగాణలోని ఐటీ ఇండస్ట్రీకి విఙ్ఞప్తి చేస్తున్నానని, ఇప్పటివరకూ ఈ గడ్డపై ఎవరికీ కరోనా వైరస్ సోకలేదని అన్నారు. దుబాయ్ లో ఖకరోనాగ బారిన పడి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, అతని ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/