2023 ఏడాదికి సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

telangana-government-declares-24th-as-deepavali-holiday

2023 ఏడాది కి గాను తెలంగాణ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. 2023 కు గాను మొత్తం 28 సెలవులు ఉంటాయని అధికారిక ప్రకటనలో తెలిపింది ప్రభుత్వం. ఇంకా.. మరో 24 ఆప్షనల్ హాలీడేస్ లిస్ట్ ని సైతం రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ ప్రకారం.. న్యూఇయర్ ఆదివారం రోజు రాగా.. భోగి పండుగా రెండో శనివారం రోజు వచ్చింది. సంక్రాంతి పండుగ కూడా ఆదివారం రోజే వచ్చింది.

దీపావళి పర్వదినం సైతం ఆదివారం నాడే వచ్చింది. తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండగా అక్టోబర్ 10న వచ్చింది. ఆ రోజు సెలవు ఉంటుంది. ఇంకా విజయవదశమి సందర్భంగా అదే నెల 24న ప్రభుత్వం సెలవును ప్రకటించింది. దీపావళి సెలవును నవంబర్ 12న ప్రకటించింది ప్రభుత్వం.

పూర్తి సెలవుల తేదీలు ఇలా ఉన్నాయి.

01/01/2023 – ఆదివారం – న్యూ ఇయర్
14/01/2023 – శనివారం – భోగి
15/01/2023 – ఆదివారం – సంక్రాంతి
26/01/2023 – గురువారం – రిపబ్లిక్ డే
18/02/2023 – శనివారం – మహాశివరాత్రి
07/03/2023 – మంగళవారం – హోలీ
22/02/2023 – బుధవారం – ఉగాది
30/03/2023 – గురువారం – శ్రీరామ నవమి
05/04/2023 – బుధవారం – బాబు జగ్జీవన్ రాం జయంతి
07/04/2023 – శుక్రవారం – గుడ్ ఫ్రైడే
14/04/2023 – శుక్రవారం – డా.బీఆర్ అంబేద్కర్ జయంతి
22/04/2023 – శనివారం – రంజాన్
23/04/2023 – ఆదివారం – రంజాన్ మరుసటి రోజు
29/06/2023 – గురువారం – బక్రీద్
17/07/2023 – సోమవారం – బోనాలు
29/07/2023 – శనివారం – మొహర్రం
15/08/2023 – మంగళవారం – ఇండిపెండెన్స్ డే
07/09/2023 – గురువారం – కృష్ణాష్టమి
18/09/2023 – సోమవారం – వినాయక చవితి
28/09/2023 – గురువారం – మిలాద్ ఉన్ నబీ
02/10/2023 – సోమవారం – మహాత్మా గాంధీ జయంతి
14/10/2023 – శనివారం – ఎంగిలి పూల బతుకమ్మ
24/10/2023 – మంగళవారం – దసరా
25/10/2023 – బుధవారం – దసరా మరుసటి రోజు
12/11/2023 – ఆదివారం – దీపావళి
27/11/2023 – సోమవారం – గురు నానక్ జయంతి
25/12/2023 – సోమవారం – క్రిస్మస్
26/12/2023 – మంగళవారం – బాక్సింగ్ డే