పెండింగ్ చలాన్‌ల గడువు పొడిగింపు

15 రోజుల పాటు గ‌డువు పొడిగింపు
ఏప్రిల్ 15 దాకా కొన‌సాగ‌నున్న పొడిగింపు

హైదరాబాద్: రాష్ట్రంలో వాహనదారుల పెండింగ్‌ చలాన్ల రాయితీ గడువును 15 రోజులు పెంచినట్టు హోంమంత్రి మహమూద్‌అలీ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మార్చి 1 నుంచి 31 వరకు ఇచ్చిన గడువును ఏప్రిల్‌ 15 వరకు పొడిగిస్తున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పెం డింగ్‌ చలాన్ల చెల్లింపుపై రాయితీ ఇవ్వడం తో వాహనదారుల నుంచి విశేష స్పందన వచ్చిందని, అదేవిధంగా ఈ గడువును మరింత పెంచాలంటూ పెద్దసంఖ్యలో విజ్ఞప్తులు వచ్చాయని పేర్కొన్నారు. గత రెండేండ్లుగా కరోనాతో పేద, మధ్య తరగతి ప్రజ లు పడుతున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు.

గత 30 రోజుల్లో 52 శాతం మంది వాహన యజమానులు చలాన్లపై రాయితీని ఉపయోగించుకొన్నారని చెప్పారు. మొత్తం రూ.840 కోట్ల విలువైన 2 కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లించినట్టు తెలిపారు. దీంతో ప్రభుత్వానికి రూ.250 కోట్ల ఆదాయం వచ్చినట్టు వివరించారు. ఇంతవరకూ చలాన్లు కట్టనివారు ఈ రాయి తీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆన్‌లైన్‌లో క్లియర్‌ చేసుకోవాలని సూచించారు. బకాయిలు చెల్లించాలనుకునే వాహ న యజమనులు ఆన్‌లైన్‌ ద్వారా లేదా ఈసేవ, మీసేవ సెంటర్ల ద్వారా చెల్లించవచ్చని సూచించారు. వివరాలకు https://echallan.tspolice.gov.in/publicview/ వెబ్‌సైట్‌ చూడాలని తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/