తెలంగాణలో సినిమా టికెట్ల ధర పెంపుకు ప్రభుత్వం అనుమతి

మల్టీప్లెక్స్ లో గరిష్ఠ ధర రూ. 250కి పెంపు
ఏసీ థియేటర్లలో గరిష్ఠ టికెట్ ధర రూ. 150


హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. థియేటర్లలో టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్టీప్లెక్స్ లలో కనీస ధర రూ. 100, గరిష్ఠ ధర రూ. 250కి పెంచింది. మల్టీప్లెక్స్ రిక్లైనర్ సీట్ల ధరను గరిష్ఠంగా రూ. 300కు పెంచుకోవడానికి అనుమతించింది. ఇక ఏసీ థియేటర్లలో కనీస ధర రూ. 50, గరిష్ఠ ధర రూ. 150గా నిర్ణయించింది. టికెట్ ధరలకు జీఎస్టీ, నిర్వహణ ఛార్జీలు అదనం. నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్లు రూ. 5, నాన్ ఏసీ థియేటర్లు రూ. 3 వసూలు చేసుకోవచ్చు.

ఆన్ లైన్ టికెటింగ్ సంస్థలు కన్వీనియన్స్ రుసుం, జీఎస్టీ వసూలు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారుల కమిటీ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఏపీలో పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా పరిస్థితి తయారయింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/