ఆర్‌టిసి ఉద్యోగులకు సమ్మెకాలం జీతాలు చెల్లింపు

TSRTC Busses
TSRTC Busses

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్‌టిసి ఉద్యోగుల సమ్మె కాలానికి సంబంధించిన జీతభత్యాలను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం రూ. 235 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది రెండు నెలలు ఆర్‌టిసి ఉద్యోగులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ సందర్భంగా సమ్మెపై కార్మికులతో చర్చలు జరిపిన సిఎం కెసిఆర్‌ హామీ ఇచ్చారు. సమ్మెకాలనికి సంబంధించిన జీతభత్యాలను తప్పకుండా చెల్లిస్తామని ఆయన కార్మికులకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఆయన తన మాటను నిలబెట్టుకున్నారు. తెలంగాణ లో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆర్‌టిసి కార్మికులకు జీతాలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ తాజా నిర్ణయం తీసుకుంది.

తాజా ఇంగ్లీష్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/english-news/