తెలంగాణకు నలుగురు ఐపీఎస్‌ ఆఫీసర్లను కెటాయించిన కేంద్రం

హైదరాబాద్‌: కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి నలుగురు ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌ను కేటాయించింది. ఈ మేరకు కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప‌రితోష్ పంక‌జ్‌(ర్యాంకు 142, బీహార్‌), సిరిశెట్టి సంకీత్‌(ర్యాంకు 330, తెలంగాణ‌), పాటిల్ కాంతిలాల్ సుభాష్‌(ర్యాంకు 418, మ‌హారాష్ర్ట‌), అంకిత్ కుమార్ శంక్వార్‌(ర్యాంకు 563, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌)ను తెలంగాణ‌కు కెటాయించింది.


కాగా, తెలంగాణ‌కు చెందిన మ‌రో ముగ్గురు.. ఎంవీ స‌త్య‌సాయి కార్తీక్‌(ర్యాంకు 103)ను మ‌హారాష్ర్ట‌కు, షీత‌ల్ కుమార్‌(ర్యాంకు 417)ను అసోంకు, రాజ‌నాల స్మృతిక్‌(ర్యాంకు 466)ను ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు కేటాయించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టానికి జ‌గ‌దీశ్ అడ‌హ‌ల్లి(ర్యాంకు 440, క‌ర్ణాట‌క‌), పంక‌జ్ కుమార్ మీనా(ర్యాంకు 666, రాజ‌స్థాన్‌), ధీర‌జ్ కునుబిల్లి(ర్యాంకు 320, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)ని కేటాయించింది కేంద్రం. దేశ వ్యాప్తంగా 150 మంది ఐపీఎస్ ఆఫీస‌ర్ల‌కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పోస్టింగ్‌లు ఇచ్చింది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/