దుబాయ్‌లోజాక్‌పాట్‌ కొట్టిన తెలుగు రైతు

Rikkala Vilas Reddy
Rikkala Vilas Reddy


దుబాయ్‌ : ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన ఓ తెలంగాణ రైతుకు ఉద్యోగం దొరకలేదు గాని, అక్కడ కొన్న లాటరీ టికెట్టు అతడిని కోటీశ్వరుడిని చేసింది. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి గ్రామానికి చెందిన రిక్కల విలాస్ రెడ్డిని ఈ అదృష్టం వరించింది. శనివారం అర్ధరాత్రి తీసిన డ్రాలో అతడు రూ.28.42 కోట్లు గెలుచుకున్నాడు. హైదరాబాద్‌లో ఉండే విలాస్‌ కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లి అక్కడ రెండేళ్లపాటు డ్రైవరుగా పనిచేశారు. కొన్ని నెలల క్రితం మరోసారి వెళ్లిన విలాస్‌ పని దొరకకపోవడంతో నెలన్నర క్రితం తిరిగి వచ్చేశారు. అయితే, మొదటిసారి దుబాయ్‌ వెళ్లినప్పుడు లాటరీ టికెట్లు కొనేవారు. ఈసారి తిరిగి వచ్చేసినప్పటికీ అక్కడి తన స్నేహితుడి ద్వారా మూడు టికెట్లు కొన్నారు. వాటిలో ఒక దానికి ఈ భారీ లాటరీ తగిలింది. 


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/