తెలంగాణ ఈసెట్ ఫలితాల విడుదల

95.16 శాతం విద్యార్థులు అర్హత

Telangana eSet results
Telangana eSet results

Hyderabad: తెలంగాణ రాష్ట్ర ఈసెట్‌-2021 ఫలితాలను బుధవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి విడుదలచేశారు. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్, బీ ఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో 95.16 శాతం విద్యార్థులు అర్హత సాధించారు. ఆగస్టు 3న జరిగిన ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)కు సుమారు 24 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల తమ ర్యాంకు కార్డులను https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

ఈ నెల 24 నుంచి ఈసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. ఆగస్టు 26 నుంచి 29 వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. ఈ నెల 26 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది. వారికి సెప్టెంబర్ 2న సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబర్ 2 నుంచి 7వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక వచ్చేనెల 13వ తేదీ నుంచి ఈసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/