రాజకీయపార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భేటి

Nagi Reddy
Nagi Reddy

హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి రాజరీయపార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల సంఘం తెలంగాణలో పురపాలక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఆయన 48 రాజకీయ పార్టీలను ఆహ్వానించి భేటి అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా వార్డుల వారీ ఓటర్ల జాబితా తయారీ, పోలింగగ్‌ కేంద్రాల ఏర్పాటుపై చర్చిస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై పార్టీల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుండి ఈ పార్టీ సీనియర్‌ నేత నిరంజన్‌, టిడిపి నుండి రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, బిజెపి నుండి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి మజ్లిస్‌ ఎమ్మెల్సీ జాఫ్రీ, సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డి సీపీఎం నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పురపాలక శాఖ సంచాలకులు టీకే శ్రీదేవి కూడా పాల్గొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/