కరోనా ఎఫెక్ట్‌: ఇంటర్‌ పరీక్షలపై సర్కారు కీలక నిర్ణయం

Intermediate examination
Intermediate examination

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కల్లోలం తీవ్రమైంది. రోజురోజుకు కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య పెరుగుతూ ఉండటం, ఇదే సమయంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణా నిబంధనల్లో మార్పులు చేసింది. విద్యార్థులు మాస్కులను ధరించి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో వారు తమ సొంత వాటర్ బాటిల్ ను పరీక్షా హాల్ లోకి తీసుకుని రావచ్చని తెలిపారు. జ్వరం, దగ్గ, జలుబుతో బాధపడుతున్న విద్యార్థులను విడిగా మరో గదిలో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తామని, దీనిపై అక్కడి ఇన్ చార్జ్, ఇన్విజిలేటర్లు సొంతంగా నిర్ణయం తీసుకుంటారని ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు తెలియజేశారు. ఇదిలావుండగా, తెలంగాణలో కరోనా అనుమానితుల సంఖ్య 550కి చేరువైంది. నిన్న ఒక్కరోజులో 90 మంది బాధితులు గాంధీ ఆసుపత్రిని ఆశ్రయించగా, వారిని అబ్జర్వేషన్ లో ఉంచారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/