సాహో సజ్జనార్‌ అంటూ నినదాలు

Public express Happy
Public express Happy

హైదరాబాద్‌: దిశ హత్యకేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై సర్వత హర్షం వ్యక్తం అవుతోంది. విషయం తెలుసుకున్న సమీప ప్రాంతాల ప్రజలు చటాన్‌పల్లి వంతెన వద్దకు భారీగా తరలి వచ్చారు. తెలంగాణ పోలీసులు జిందాబాద్‌ అంటూ పూల వర్షం కురిపించారు. దిశ అత్యాచార ఘటన జరిగినప్పటి నుంచి తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు తాజా ఘటనతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కిరాతకులను ఎన్‌కౌంటర్‌ చేయడంతో ఆడ పిల్లలపై అనుచితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి రుజువైనట్లు చెబుతున్నారు. సాహో సజ్జనార్‌ అంటూ నినదిస్తున్నారు. అంతేకాకండా డయల్‌ 100కి పెద్ద ఎత్తున ఫోన్‌ చేసి అభినందిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ ఘటనపై దేశవ్యాప్తంగా పోలీసులను పెద్దఎత్తున ప్రజలు సమర్థిస్తున్నారు. పలుచోట్ల సంబరాలు జరుపుకుని, స్వీట్లు పంచుకుంటు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/