విచిత్ర పూజలు చేస్తూ .. వివాదంలో చిక్కుకున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వివాదంలో చిక్కుకున్నారు. క‌రోనా నేప‌థ్యంలో మీడియా ముందుకు వస్తూ ప్రజలకు జాగ్రత్తలు చెపుతూ సుపరిచితమైన శ్రీనివాస్..తాజాగా ఓ విచిత్రమైన పూజలు పాల్గొని వార్తల్లో నిలిచారు. గ‌త కొంత కాలంగా కొత్తగూడెం, ఖ‌మ్మం ప‌రిధిలో ప‌ర్య‌టిస్తున్న శ్రీనివాస్.. దేవుడు క‌రుణిస్తాడ‌ని చెబుతూ విచిత్ర పూజ‌లు చేయిస్తున్నార‌ట‌.

అంతేకాకుండా ఖ‌మ్మంలో త‌న‌ను తాను దేవ‌త‌గా ప్ర‌క‌టించుకున్న టీఆర్ఎస్ ఎంపీపీ చుట్టూ ఆయ‌న ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తూ కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన విజువ‌ల్స్ ఇప్పుడు మీడియాలో వైర‌ల్‌గా మారిపోయాయి. అంతేకాకుండా రాజకీయ రంగ ప్ర‌వేశం కోస‌మే శ్రీనివాస్ క్షుద్ర పూజ‌లు చేస్తున్నారంటూ ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో లు చూసిన నెటిజన్లు మూఢనమ్మకాలను నమ్మొద్దంటూ చెప్పాల్సిన హెల్త్ డైరెక్టర్..ఇలా పూజలు చేయడం.. త‌న‌ను తాను దేవ‌త‌గా చెప్పుకుంటున్న మహిళా మాటలు వినడం, ఆమెకు పూజలు చేయడం , దేవతగా కొలవడం వంటివి శ్రీనివాస్ ను విమర్శల పాలుచేస్తున్నాయి. మరి దీనిపై శ్రీనివాస్ ఎలా స్పందిస్తాడో చూడాలి.