తెలంగాణ ప్రజలకు కరెంట్ షాక్‌..

తెలంగాణ ప్రజలకు కరెంట్ బిల్లులు షాక్ ఇవ్వబోతున్నాయి. ఏప్రిల్ 01 నుండి కరెంట్ బిల్లుల చార్జీలు పెరిగే అవకాశం ఉంది. విద్యుత్ పంపిణీ సంస్థలు భారీ లోటు తో కొనసాగుతుండటం అలాగే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అనిపించకపోవడం కారణంగా ఈ భారమంతా తెలంగాణ వినియోగదారుల పైన ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం 2021-22, వచ్చే 2022-23 ఆర్థిక సంవత్స రాలకు కలిపి డిస్కాములు ఏకంగా… రూ. 21550 కోట్ల లోటు ను కలిగి ఉన్నాయి. ఈ రెండేళ్ల కాలానికి గాను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఈ ఆర్ సి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాలలో… డిస్కాంలు ఈ విషయాన్ని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోనూ… కూడా ఇంత భారీ లోటుతో ఉన్నట్లు తెలిపాయి. టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించాకే తాము ముందుకు వెళతామని టీఎస్‌ ఈఆర్‌సీ చైర్మన్‌ శ్రీరంగారావు తెలిపారు.

వాస్తవ స్థితిగతులపై ప్రజాభిప్రాయ సేకరణ, ప్రభావ వర్గాల నుంచి అభ్యంతరాలు సేకరించాకే చార్జీల పెంపుపై నిర్ధారణకు వస్తామన్నారు. దీనిపట్టి చూస్తే పేద, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల వినియోగదారుల విద్యుత్‌ బిల్లులు భారీగా పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.