కలెక్టర్లతో తెలంగాణ సీఎస్ టెలీ కాన్ఫరెన్స్

కరోనా వాక్సినేషన్ ఏర్పాట్లపై సమీక్ష

TS CS Somesh kumar
TS CS Somesh kumar

Hyderabad: అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి   సోమేశ్ కుమార్ ఈ రోజు  టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కరోనా వాక్సినేషన్ ప్రక్రియ కోసం చేపట్టనున్న వ్యవస్థాపరమైన ఏర్పాట్లను కలెక్టర్లతో ఆయన సమీక్షించారు. మొదటి దశలో ప్రభుత్వ, ప్రవేట్ రంగాల్లో పనిజేస్తున్న హెల్త్ కేర్ వర్కర్లoదరికి కోవిడ్ -19 వాక్సినేషన్ ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై కలెక్టర్లకు వివరించారు. 

 వాక్సినేషన్ ప్రారంభించే కేంద్రాలలో నిర్దేశించిన ఆపరేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం వసతులు కల్పించాలని సూచించారు.

అదేవిధంగా ఎక్కడైనా ప్రతికూల ప్రభావం కనపడితే వెంటనే తగు చర్యలు చేపట్టేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు.

వాక్సినేషన్ కు నిర్దేశించిన ప్రతి కేంద్రo లో   ఏర్పాట్లను సమన్వయ పరిచేందుకు ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని సూచించారు. ముందు జాగ్రత్త గా వాక్సినేషన్ ను రిజర్వులో ఉంచుకోవాలని సలహా ఇచ్చారు.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/