మేడారం జాతరకు భారీ బందోబస్తు
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగదు: సిఎస్

ములుగు: మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని తెలంగాణ సిఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. గతంతో పోల్చుకుంటే ఈ సారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని ఆయన అన్నారు. దీంతో అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తుందని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తామని ఆయన చెప్పారు. మరోవైపు తెలంగాణ డిజిపి కూడా ప్రత్యేకంగా జాతర కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మేడారం జాతరకు ఈ సారి భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలస్తుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవార్లను గద్దెలపైకి తీసుకువచ్చే సమయంలో ప్రత్యేక బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 300లకు పైగా సీసీ కెమెరాలను అమర్చం జరిగిందని ఆయన వెల్లడించారు. వాటి ద్వారా ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళిసై కూడా ఈ జాతరకు వస్తున్నట్లు తెలస్తుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/