దిశ ఘటనపై పార్లమెంటులో ప్రస్తావన

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు

Parliament of India
Parliament of India

హైదరాబాద్‌: దిశ అత్యాచార ఘటనలో నిందితులను ఏడురోజుల కస్టడీ కోరుతూ షాద్‌ నగర్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసుపై మరికాసేపట్లో కోర్టు విచారణ జరపనుంది. మరోవైపు బార్‌ అసోసియేషన్‌ నిందితుల తరపున వాదించకూడదని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా దిశ అత్యాచార ఘటనను కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించాలని నిర్ణయించుకున్నారు. ఎంపి రేవంత్‌రెడ్డి పార్టీ తరపున లోక్‌ సభలో వాయిదా తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. కాగా ప్రస్తుతం ఈ కేసులోని నలుగురు నిందితులు చర్లపల్లి జైలులో ఉన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/