గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

bhatti vikramarka
bhatti vikramarka

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్యరాజన్‌తో భేటీ అయ్యారు. ఆర్టీసీ సమ్మె, ఇతర అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వైఫల్యాలపై వినతిపత్రం సమర్పించారు. ఈ భేటీలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతియా మరియు ముఖ్య నేతలు భట్టి విక్రమార్క, అంజన్‌కుమార్‌ యాదవ్‌, జనారెడ్డిలతో పాటు ఇతర నాయకులు ఉన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు గాంధీభవన్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు ర్యాలీగా బయలుదేరారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌ నుంచి బయటకు రాకుండా ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు కాంగ్రెస్‌ శ్రేణులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగడంతో పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలకు మాత్రం గవర్నర్‌ను కలిసేందుకు అనుమతిచ్చారు.
తాజా జాతీయ వార్తలకోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/