నేడు హైదరాబాద్‌లో మరో మెట్రో ప్రారంభం

hyderabad metro
hyderabad metro

హైదరాబాద్‌: నగరంలో మరో మెట్రో గమ్యానికి సిద్ధమైంది. కారిడార్‌2లోని జేబీఎస్‌ ఎంజీబీఎస్‌ లేన్ ఈ రోజు ప్రారంభం కానుంది. 11 కిలోమీటర్ల మార్గాన్ని సిఎం కెసిఆర్‌ సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. కాగా, ఈ రూట్‌లో జేబీఎస్‌పరేడ్‌ గ్రౌండ్స్, సికింద్రాబాద్‌ వెస్ట్, న్యూ గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్, ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్లు ఉన్నాయి. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్ చేరుకునేందుకు 16 నిమిషాల సమయం పట్టనుంది. అయితే ఈనేపథ్యలో మంత్రులు కెటిఆర్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో కలిసి మెట్రో రైలులో ఎంజీబీఎస్ వరకు ప్రయాణించనున్నారు. చిక్కడపల్లి స్టేషన్‌లో కాసేపు ఆగి స్టేషన్‌ను పరిశీలించనున్నారు.

. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/