5న తెలంగాణ కేబినెట్‌ సమావేశం

5న తెలంగాణ కేబినెట్‌ సమావేశం
cm kcr

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ ఈ నెల 5న సమావేశం కానుంది. సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సెక్రటేరియట్‌ నూతన భవన సముదాయం నిర్మాణం, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, కోవిడ్‌19 పరిస్థితులు, కరోనా నేపథ్యంలో విద్యా రంగంలో తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/