తెలంగాణ కేబినెట్ స‌మావేశం ప్రారంభం

హైదరాబాద్ : ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్ష‌త‌న తెలంగాణ రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభ‌మైంది. ఈ స‌మావేశానికి మంత్రులు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై చ‌ర్చించి, తేదీల‌ను ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంది. దళితబంధు పథకంపై ఇచ్చే స్టేట్‌మెంట్‌పైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. కృష్ణా జలాల విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించనున్నది. విద్యుత్తు వివాదం, ఉద్యోగ ఖాళీల గుర్తింపు, నియామకాల నోటిఫికేషన్‌ చర్చకు రానున్నట్టు సమాచారం.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/