సాయంత్రం తెలంగాణ మంత్రివర్గ సమావేశం

Telangana Cabinet to Meet Today
Telangana Cabinet to Meet Today

హైదరాబాద్‌: ఈ రోజు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ నేతృత్వంలో మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రి మండలి చర్చంచనుంది. కాగా నిన్న తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న విషయం కూడా తెలిసిందే. దీంతో ఈ రోజు జరిగే కేబినేట్‌ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌ కు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. మరోవైపు బడ్జెట్‌ పై వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు గానూ మంత్రి వర్గం సమావేశం ఏర్పాటు చేయనుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/