ప్రారంభమైన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం
TS CM Kcr
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రి మండలి అత్యవసర సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో కరోనా పరిస్థితులపై మంత్రి మండలి సమీక్షించనుంది. లాక్‌డౌన్ వేళల సడలింపుతోపాటు వివిధ అంశాలపై చర్చించనుంది. కాగా, రాష్ట్రంలో ఇవాళ్టితో లాక్‌డౌన్ ముగియనున్న విషయం తెలిసిందే. కరోనా ఉధృతి తగ్గిన దృష్ట్యా లాక్‌డౌన్ ఆంక్షలనూ ప్రభుత్వం సడలించే అవకాశం ఉంది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/