జులై 2న తెలంగాణ కేబినెట్ సమావేశం

కరోనా వైరస్‌ కట్టడిపై కీలక నిర్ణయం

cm kcr

భైదరాబాద్‌: జులై 2న తెలంగాణ కేబినెట్ భేటీ జరగనున్నట్టు సమాచారం. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్‌ కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించే అంశంపై ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. హైదరాబాద్‌ పరిధిలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో 15 రోజుల పాటు అత్యంత కఠినంగా లాక్‌డౌన్‌ విధించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నివేదిక సమర్పించడంతో… కేబినెట్ ఈ అంశంపై ప్రధానంగా చర్చించనుందని వార్తలు వినిపిస్తన్నాయి. కాగా లాక్‌డౌన్‌లో భాగంగా అత్యంత కఠినంగా కర్ఫ్యూ విధించాలని, రోజుకు కేవలం గంటా రెండు గంటలు మాత్రమే నిత్యావసరాల కోసం సడలింపులివ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈక్రమంలోనే జులై 3 నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధించే అవకాశముందని ప్రభుత్వవర్గాల్లో చర్చ జరుగుతోంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/