తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

CM KCR
CM KCR

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. సిఎం కెసిఆర్‌ నేతృత్వంలో ఈ భేటీ జరుగుతుంది. కాగా ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరుగనున్నట్లు సమాచారం. పల్లె ప్రగతి కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చర్చించనున్నారు. అలాగే త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం తలపెట్టనున్న నేపథ్యంలో మంత్రివర్గం దాని గురించి కూడా చర్చించనుంది. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రెవెన్యూ చట్టంలో మార్పుల అంశంపై కూడా కేబినేట్‌ చర్చించనుంది. అంతేకాకుండా సచివాలయ డిజైన్లపై కూడా తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/