తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

ఆర్టీసిపై కీలక చర్చ జరిపే అవకాశం

CM KCR
CM KCR

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రివర్గం సమావేశం ప్రారంభమైంది. ఆర్టీసి సమస్యపై ప్రధానంగా చర్చించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. సిఎం కెసిఆర్‌ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఆర్టీసికి శాశ్వత ముగింపు ఇచ్చేందుకు చర్చలు జరుగుత్నుట్లు కీలక సమాచారం. ఆర్టీసి కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరతామని వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో సిఎం కెసిఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? ఆర్టీసి కార్మికుల భవిష్యత్తు ఏంటి అనే అంశాలపై కార్మికుల్లో ఉత్కంఠ నెలకొంది. రెండు రోజులపాటు సాగే ఈ సమావేశాల్లో రాష్ట్రంలో 5100 రూటు పర్మిట్లను ప్రైవేటుకు అప్పగించే దిశగా నిర్ణయం తీసుకోనున్నారు. అయితే వాటిని పూర్తిగా గ్రామీణ పరిధిలో అమలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. మంత్రి మండలి సమావేశంలో వీటిని ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. కాగా నేడు మాత్రం పూర్తిగా ఆర్టీసి అంశంపైనే కేబినేట్‌ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/