సిఎం కెసిఆర్‌పై లక్ష్మణ్‌ విమర్శలు

Laxman
Laxman

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఏఏ) వ్యతిరేకించేది కేవలం ఓవైసి మెప్పు పొందేందుకేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. సిఏఏ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ కేబినేట్‌ తీర్మానం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. పార్లమెంట్‌లో పూర్తి మద్దతుతో తీసుకొచ్చిన చట్టాన్ని రాష్ట్రం ఎలా వ్యతిరేకించగలదని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. సిఎం కెసిఆర్‌కు రాజ్యాంగం తెలియదా? అని ఆయన నిలదీశారు. మత వివక్షకు గురైన వారికి, శరణార్థులకు భద్రత కల్పించేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టు వివరించారు. కెసిఆర్‌కు నిజంగా ప్రేమ ఉంటే బంగ్లాదేశ్, పాకిస్థాన్ ముస్లింలకు పౌరసత్వం ఇవ్వాలని తీర్మానం చేయాలని సవాలు విసిరారు. మజ్లిస్ నేతలను కెసిఆర్‌ పెంచి పోషిస్తున్నారని, కానీ ఆ పార్టీ నాయకులు కాటు వేసేందుకు రెడీగా ఉన్నారని లక్ష్మణ్ ఆరోపించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/