ఆర్టీసి సమ్మెపై కేంద్రమంత్రి రంగప్రవేశం!

Nitin Gadkari & cm kcr
Nitin Gadkari & cm kcr

హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసి కార్మికులు సమ్మె ప్రారంభించి 47 రోజులు, అయితే ఇప్పుడు ఆ సమ్మెకు ముగింపు పలికి కార్మికులు విధుల్లో చేరేందుకు సముఖత చూపిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను తెలంగాణ బిజెపి ఎంపిలు కేంద్రానికి వివరించారు. సమ్మె కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి ఆర్టీసి సమ్మెపై మాట్లాడామని తెలంగాణ బిజెపి ఎంపి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పక్కనబెట్టి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఆర్టీసి అంశంపై జోక్యం చేసుకునే అధికారం ఉంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన నితిన్‌ గడ్కరీ త్వరలోనే తెలంగాణ సిఎం కెసిఆర్‌తో మాట్లాడతానని చెప్పారని కిషన్‌ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజ§్‌ు, ఉన్నతాధికారులను ఢిల్లీకి పిలిపించి చర్చిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news