తెలంగాణ బిజెపి నేతలకు అధిష్టానం అల్టిమేటం జారీ ..

Telangana BJP leaders issue ultimatum


తెలంగాణ లో ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి తీరాలని కసిగా ఉన్న బిజెపి..మునుగోడు ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని చూస్తుంది. ఇప్పటికే నేతలంతా ప్రచారంలో మునిగిపోయారు. ఈ క్రమంలో నేతలకు అధిష్టానం అల్టిమేటం జారీ చేసింది. కీలక నాయకులతో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా ప్రచారానికే పూర్తి సమయం కేటాయించాలని ఆదేశించింది. రాత్రి కూడా మునుగోడులోనే బస చేయాలని నాయకులను ఆదేశించినట్లు సమాచారం. పార్టీలో చేరికల కన్నా మునుగోడు ప్రచారం పైనే దృష్టి సారించాలని స్పష్టం చేసిందట. హైదరాబాద్ లో ఉన్న నాయకులంతా తక్షణమే మునుగోడు వెళ్లాలని ఆదేశించినట్లు తెలుస్తుంది.

మునుగోడు ఉప ఎన్నిక నేసథ్యంలో బీజేపీ స్టీరింగ్ కమిటీలో ఉన్న ఇద్దరు నాయకులు టీఆర్ ఎస్ లో చేరడంతో ఉప ఎన్నికలో కమలనాథులు వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. స్వామి గౌడ్, దాసోజు పార్టీ మారడం తో వ్యూహం చేంజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరు పార్టీ మారడానికి ముందురోజు వరకు మునుగోడు బిజేపీ స్టీరింగ్ కమిటీ సభ్యులుగా వ్యవహరించారు. ఆ టైమ్ లో బై పోల్ ప్లానింగ్ మీటింగ్స్ లో పాల్గొన్నారు. టిఆర్ఎస్ లో ఆ ఇద్దరూ చేరడంతో ఎన్నికల ప్లాన్ మార్చాలని పార్టీ హై కమాండ్ ఆదేశాలు జారీచేసింది.

పోల్ మేనేజ్ మెంట్ పై కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు బీజేపీ నేతలు. వేగులు ఎవరు.. పార్టీకి కట్టుబడి పనిచేసే వారు ఎవరు అనేదానిపై బిజేపీ లో కన్ఫ్యూజన్ నెలకొంది. దీంతో వ్యూహాం మార్చి ముందుకెళ్లాలని నిర్ణయించింది. బీజేపీలో ఉంటూ పక్కాపార్టీకి మద్దతుగా పనిచేస్తున్న వారు ఎవరు.. ఇక్కడి సమాచారాన్ని అక్కడికి చేరవేస్తోంది ఎవరు అనేదానిపై ప్రధాన దృష్టి పెట్టింది తెలంగాణ బిజెపి.