ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన స్పీకర్ పోచారం

తాజా పరీక్షలో కరోనా నెగెటివ్

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల 24 నుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందరు. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకోనున్నారు. తాజా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో పోచారంకు నెగెటివ్ వచ్చింది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో ఆయనను వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండనున్నారు. ఇటీవల పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి పెళ్లి హైదరాబాదులో జరిగింది. ఈ వివాహానికి ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. ఈ పెళ్లి తర్వాతే పోచారంకు కరోనా పాజిటివ్ వచ్చింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/