ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

హైదరాబాద్: మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. గవ‌ర్నర్‌ ప్రసం‌గా‌నికి ధన్య‌వా‌దాలు తెలిపే తీర్మా‌నంపై చర్చిం‌చ‌ను‌న్నారు. చర్చ అనం‌తరం సీఎం కెసిఆర్ సమా‌ధానం ఇస్తారు. ధన్య‌వాద తీర్మా‌నాన్ని ప్రభుత్వ విప్‌ గువ్వల బాల‌రాజు ప్రతి‌పా‌ది‌స్తారు. మరో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత బల‌ప‌రు‌స్తారు. ప్రతి‌పక్ష సభ్యులు మాట్లా‌డిన అనం‌తరం సీఎం కెసిఆర్ సమా‌ధానం ఇస్తారు. మండ‌లి‌లోనూ గవ‌ర్నర్‌ ప్రసం‌గా‌నికి ధన్య‌వా‌దాలు తెలిపే తీర్మా‌నంపై చర్చి‌స్తారు. తీర్మా‌నాన్ని ప్రభుత్వ విప్‌ భాను‌ప్ర‌సాద్‌ ప్రతి‌పా‌ది‌స్తారు, గంగా‌ధ‌ర్‌‌గౌడ్‌ బల‌ప‌రు‌స్తారు. చర్చ అనం‌తరం ప్రభుత్వం జవా‌బి‌స్తుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/