ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించి, ప్ర‌శ్నోత్త‌రాలు చేప‌ట్టారు. త‌ల‌స‌రి విద్యుత్ వినియోగం, వైకుంఠ‌ధామాలు, డంపింగ్ యార్డులు, ఆరోగ్య ల‌క్ష్మి అమ‌లు, చెక్‌డ్యాంల నిర్మాణం, ఆరోగ్య వివ‌రాల రికార్డులు, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌శ్నోత్త‌రాల్లో చ‌ర్చించ‌నున్నారు.

అనంత‌రం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ద‌ళిత బంధుపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ చేప‌ట్ట‌నున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన అనంత‌రం ఈ ప‌థ‌కంపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివ‌ర‌ణ ఇవ్వ‌నున్నారు. మైనార్టీల సంక్షేమం, పాత‌బ‌స్తీలో అభివృద్ధిపై శాస‌న మండ‌లిలో స్వ‌ల్పకాలిక చ‌ర్చ చేప‌ట్ట‌నున్నారు. జీఎస్టీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు, టౌటింగ్ చ‌ట్టం బిల్లుపై కూడా మండ‌లిలో చ‌ర్చించ‌నున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి https://www.vaartha.com/news/international-news/