తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా

assembly-session

హైదరాబాద్ః తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. శాసనసభ, మండలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే భీ భూపతిరావు మృతికి శాసనసభ సంతాపం ప్రకటించింది. అనంతరం ఏడు సవరణ బిల్లులను సంబంధిత శాఖల మంత్రులు శాసనసభలో ప్రవేశపెట్టారు. వీటిపై మంగళవారం చర్చించనున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల బిల్లు-పర్యవసానాలపై లఘచర్చ జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్‌ రంగంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ముఖ్యమంత్రి కెసిఆర్‌ వివరించారు. విద్యుత్‌ రంగంలో తెలంగాణకు జరిగిన అణ్యాయాన్ని గణాంకాలతో సహా తెలిపారు. విద్యుత్ బిల్లు వెనక్కి తీసుకోవాలని రేపు సభలో తీర్మానం చేయనున్నారు. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని రేపు తీర్మానించనున్నారు. గురుకులాల్లో భోజనం, నాణ్యతపై సమీక్షిస్తామని సీఎం తెలిపారు. శాసన మండలిలో కూడా విద్యుత్‌ సంస్కరణలపై సభ్యులు చర్చించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/