నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

TS Assembly
TS Assembly

హైదరాబాద్‌: ఈరోజు నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు మొదలవుతాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం 2 వారాల ముందు నుంచే పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. ఓ 20 రోజులు సమావేశాలు జరపాలని అనుకుంటున్నారు. పరిస్థితిని బట్టీ నిర్ణయాలు ఉంటాయి. ఇప్పటికైతే… ప్రజా ప్రతినిధులకు కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలూ పాటిస్తున్నారు. ఆల్రెడీ సీఎం కేసీఆర్, స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ కరోనా టెస్టులు చేశారు. వారితోపాటూ… మార్షల్స్, మీడియా సభ్యులు, పోలీసులు, మంత్రుల పీఏలు, పీఎస్‌లు అందరికీ టెస్టులు జరిగాయి. కరోనా నెగెటివ్ రిపోర్ట్ చూపించిన వారికే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ముఖ్యమంత్రి సహా అందరికీ ఈ రూల్ వర్తిస్తుంది.

అసెంబ్లీ, మండలిలో సోషల్ డిస్టాన్స్‌లో కూర్చోవాలి కాబట్టి… అసెంబ్లీలో 40 సీట్లు, మండలిలో 8 సీట్లు అదనంగా వేశారు. సమావేశాలు ఎలా జరపాలో ఇవాళ జరిగే తీతిది మీటింగ్‌లో డిసైడ్ చేసుకుంటారు. ఈసారి సభల్లో రెవెన్యూ చట్టం, మరో 4 బిల్లులపై చర్చిస్తారని తెలిసింది. మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మానం చేస్తారు. కరోనా వైరస్ వ్యాప్తి, రాయలసీమ ఎత్తిపోతల పథకం, నియత్రిత పద్ధతిల సాగు, రిజిస్ట్రేషన్లు వంటి అంశాలపై చర్చించనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/