కెసిఆర్ కు ఓటమి భయం పట్టుకుందిః రాజగోపాల్ రెడ్డి

అధికార దుర్వినియోగంతో మునుగోడులో టిఆర్ఎస్ గెలిచిందని విమర్శ

telangana-assembly-elections-will-be-held-along-with-karnataka-says-komatireddy

హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్‌ కు ఓటమి భయం పట్టుకుందని బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని… కర్ణాటకతో పాటే తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. బిజెపి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికార దుర్వినియోగంతోనే మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ గెలిచిందని అన్నారు. రాష్ట్రంలో బిజెపికి వస్తున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు బిజెపిలోకి రావాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలవబోయేది బిజెపినే అని చెప్పారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/