మరికాసేపట్లో ప్రవేశపెట్టనున్న తెలంగాణ బడ్జెట్‌

Minister Harish rao and CM KCR
Minister Harish rao and CM KCR

హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 2020-21 వార్షిక బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం మరికాసేపట్లో ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. మార్చి 9న హోలీ పండగ రావడంతో ఒక్కరోజు ముందే బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ బడ్జెట్‌ ప్రధానంగా రైతు సంక్షేమ బడ్జెట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో కరోనా వైరస్‌పై పోరుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఏమైనా కేటాయిస్తుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక ఏ రంగానికి ఎలాంటి కేటాయింపులు జరిపారన్నది తెలియాల్సిఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/