టాటా ఆధ్వర్యంలో మహిళ దినోత్సవం వేడుకలు

Telangana American Telugu Association
Telangana American Telugu Association

న్యూజెర్సీ: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టాటా) ఆధ్వర్యంలో యూఎస్‌లోని న్యూజెర్సీలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్‌లో మార్చి 16న ఈ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో 600 మంది పాల్గొన్నారు. వేడుకల తరువాత వంద ఫ్యామిలీలు టాటా లైఫ్ మెంబర్‌షిప్ తీసుకున్నారు. ఈ వేడుకల్లో టాటా సభ్యులు రంజిత్ క్యాతం, సహోదర్ రెడ్డి, పవన్ రవ్వ, మల్లిక్ రెడ్డి, మధవి సొలేటి, రామ వనమ, సురేశ్ వెంకన్నగారి, ప్రసాద్ కన్నారపు, సుదర్శన్ చేతుకురి పాల్గొన్నారు. ఈ వేడుకలను శివ రెడ్డి కొల్ల, కిరణ్ దుగ్గజి, దీప్తి మిర్యాల, నవ్యారెడ్డి, శ్రీకాంత్ అక్కపల్లి, గంగాధర్ ఉప్పల, రామ్ మోహన్, మహేందర్ నరాల, నవీన్ కుమార్ యల్లమండ్ల, నరేందర్ యరవ, గోపి వుత్కూరి, విజయ్ భాస్కర్, సతీశ్ జిల్లెల, వేణు సుంకరి నిర్వహించారు.


మరిన్ని ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/